వైరా టౌన్, ఫిబ్రవరి 7: గత శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఎద్దేవా చేశారు. వైరా మున్సిపాలిటీలోని 5, 6, 9 వార్డుల్లో సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ కూటమి ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
చేశారు. వైరాలో సెంట్రల్ లైటింగ్, ఇండోర్ స్టేడియం, రిజర్వాయర్ ట్యాంక్ బండ్, సమీకృత మార్కెట్, గిరిజన భవనం వంటి నిర్మాణాలు చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఇంకా అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు లకావత్ గిరిబాబు, బానోతు మంజులా మదన్‌లాల్, బాణాల వెంకటేశ్వరరావు, అప్పం సురేశ్, కట్టా స్వరూపరాణి, పోతినేని సుదర్శన్‌రావు, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.