అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం పీఏ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బోలిగోర్ల కొండల్ తోపాటు...
– పీఏ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిక
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన రవీంద్ర కుమార్
దేవరకొండ, నవంబర్ 04 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం పీఏ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బోలిగోర్ల కొండల్ తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, వ్యవసాయ సంక్షోభం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ సమస్యలను, ప్రభుత్వ పనితీరును దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు.

అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్కు ఎప్పుడు ఓటు వేయాలా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్లుగురి వల్లపు రెడ్డి, సర్పంచులు రైనబోయిన శ్రీను, ఆడెపు నగేష్, రమావత్ కిషన్, బొడ్డుపల్లి మహేందర్, మద సుధాకర్ గౌడ్, తోటకురి పరమేష్, వంగల కృష్ణారెడ్డి, దీపావత్ నరేందర్, తాళ్ల విష్ణు, రామావత్ శ్రీను, రామావత్ దామోదర్, లోకేష్, ఏడుకొండలు, పేర్ల రవి, నారాయణదాసు వెంకటయ్య, ధర్మపురం కోటేష్, నేనావత్ కృష్ణ, రామలింగం పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారు పీఏ పల్లి గ్రామ వార్డు సభ్యులు చల్ల పద్మ అన్వేష్, బోలిగోర్ల రామయ్య, అరవింద్, సాయి,శివ, అఖిల్, గిరి తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
‘వరి కొయ్యలను తగలబెట్టవద్దు’
‘ఫ్లోరోసిస్ నివారణలో మిషన్ భగీరథ నీరు కీలకపాత్ర’
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

