Harish Rao | రాజ్ పాకాల సొంతిళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేసుకుంటే.. రేవ్ పార్టీ అంటూ బద్నాం చేయడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రత్యర్థులను ఎదురించలేని వాళ్లే ఇలా తరచూ కుటుంబాలను లక్ష్యంగా ఎంచుకుంటారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న ప్రతీకార రాజకీయాలు, డైవర్షన్ టాక్టిక్స్‌ను హరీశ్‌రావు ఖండించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను అరెస్టు చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలతో రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ ( ప్రేమ దుకాణం) నిజస్వరూపం పూర్తిగా బట్టబ
హైదరాబాద్‌లోని ఓరియన్ విల్లాస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్దకు ఆదివారం మధ్యాహ్నం భారీగా చేరుకున్న పోలీసులు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలు తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా లోనికి వెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో వారిని అడ్డగించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, బాల్క సుమన్, మన్నె క్రిశాంక్, రాజుసాగర్, రాకేశ్, ఆశిష్ యాదవ్ సహా 15 మంది అరెస్టు చేశారు.