నాగర్‌కర్నూల్ : రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ( Congress Government ) వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ( Marri Janardhan Reddy ) పిలుపునిచ్చారు. బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ, విద్యార్థి, యువజన పోరుబాటలో పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ ( Rally ) నిర్వహించారు. పాత మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, నిరుద్యోగుల ప్రదర్శన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్
చేశారు. నిరుద్యోగ భృతి అమలు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు నినాదాలు
చేశారు. ఉద్యోగాల భర్తీతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులు అప్పటివరకు విరామం లేకుండా పోరాటం కొనసాగించాలని సూచించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని , ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం కమిషన్లు దండుకుంటోందని విమర్వించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు హామీ ఇచ్చిన రూ.5 లక్షల విద్యానిధి ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. బీసీలకు ఉచిత ఫీజు రీయింబర్స్మెంట్ హామీని అమలు చేయలేదని ఆరోపించారు.