Marri Janardhan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
Marri Janardhan Reddy | రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నాగర్‌కర్నూల్ : రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ( Congress Government ) వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ( Marri Janardhan Reddy ) పిలుపునిచ్చారు. బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ, విద్యార్థి, యువజన పోరుబాటలో పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ ( Rally ) నిర్వహించారు. పాత మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, నిరుద్యోగుల ప్రదర్శన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్
చేశారు. నిరుద్యోగ భృతి అమలు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు నినాదాలు
చేశారు. ఉద్యోగాల భర్తీతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులు అప్పటివరకు విరామం లేకుండా పోరాటం కొనసాగించాలని సూచించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని , ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం కమిషన్లు దండుకుంటోందని విమర్వించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు హామీ ఇచ్చిన రూ.5 లక్షల విద్యానిధి ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. బీసీలకు ఉచిత ఫీజు రీయింబర్స్మెంట్ హామీని అమలు చేయలేదని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

