Actor Shiva Rajkumar | కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఇటీవల హిందీ గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ క్షమాపణలు కోరారు. ‘ఒరిజినల్ మాన్స్టర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హిందీని జాతీయ భాషగా అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
దీనిపై స్పందించిన శివరాజ్‌కుమార్, తాను పొరపాటున ఆ మాట అన్నానని, హిందీ మన దేశంలోని భాషలలో ఒకటి మాత్రమేనని స్పష్టం చేశారు. గత సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు కన్నడ భాష ఎంత ముఖ్యమో, ఇతరులకు వారి భాష అంతే ముఖ్యమని అన్నారు. అప్పుడు కలిగిన గందరగోళం వల్ల అలా మాట్లాడానని, ఎవరి మనసైనా నొచ్చుకుంటే క్షమించాలని కోరారు.