గజ్వేల్ : అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే పరామవధిగా కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుల దాడి ఈసారి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై ( KCR Camp Office ) దాడి చేశారు. గజ్వేల్ ( Gajwel ) లోని క్యాంపు కార్యాలయంలోకి చొరబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ( Congress ) విధ్వంసం సృష్టించారు.

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి, దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు అలసత్వం వహించడం గర్హనీయమని పేర్కొన్నారు.