తుర్కయంజాల్, అక్టోబర్ 21: బీసీలకు రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ యత్నిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ నెల 18న బీసీ బంద్‌లో పాల్గొన్న బీసీ నాయకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో అరెస్ట్ అయిన నాయకులు రామ్మూర్తి, రాముకోటిలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని అందులో భాగంగానే బీసీ నేతలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.