న్యూఢిల్లీ, జూన్ 11 : కాంగ్రెస్ మిత్ర ద్రోహ వైఖరి మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో డీఎంకేకు వెన్నుపోటు పొడిచి అధికార టీవీకేతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత నేతృత్వంలోని టీఎంసీ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా, దానిపై కాంగ్రెస్ టీమ్ వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నది. టీఎంసీలో ఉన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి, ఏకంగా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీ నం చేసుకునేందుకు కుటిల య త్నాలు ప్రారంభించింది.
తద్వారా బెంగాల్లో మళ్లీ బలపడటానికి హస్తం పార్టీ నక్కజిత్తులు వేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సైద్ధాంతికంగా విచ్ఛిన్నం కాని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అందువల్ల ఆర్ఎస్ఎస్-బీజేపీని ఎదుర్కోడానికి అది అత్యంత అనువైనదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జ్లు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు హాజరైన పార్టీ అంతర్గత సమావేశంలో ప్రస్తావించారు.