హైదరాబాద్, ఆట ప్రతినిధి : భాగ్యనగరం వేదికగా జరిగే రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2లో ఆతిథ్య హైదరాబాద్ హీరోస్ మరోసారి స్పెయిన్ స్టార్ మాన్యుల్ మొరెనో కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఈనెల 16 నుంచి గచ్చిబౌలి స్టేడియం వేదికగా మొదలయ్యే ఆర్పీఎల్ రెండో సీజన్ కోసం హైదరాబాద్ హీరోస్ కెప్టెన్‌గా మొరెనోను ఎంపిక చేసినట్టు ఆ ఫ్రాంచైజీ గురువారం ప్రకటించింది.
వైస్ కెప్టెన్‌గా భారత్‌కు చెందిన సుమిత్కుమార్రాయ్ వ్యవహరించనున్నట్లు జట్టు సహ యజమాని శ్రీనాథ్ చిట్టూరి పేర్కొన్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన జెర్సీని ఆవిష్కరించారు. ఈనెల 16న తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరు బ్రేవ్హార్ట్స్తో హైదరాబాద్ హీరోస్ తలపడుతుంది.