హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తన వ్యవసాయ భూమిని మొక్కలతో అడవిగా మలిచిన జల హక్కుల ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అభినందించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సత్యనారాయణ తనకున్న 70 ఎకరాల భూమిలో పెద్ద మొక్కలను పెంచి అడవిగా మార్చారని ఎంపీ తెలిపారు. ఈ మొక్కలు పక్షులు, జంతువులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. దుశ్చర్లకు సెల్యూట్ అంటూ సంతోష్‌కుమార్ ఆదివారం ట్వీట్ చేశారు.