హైదరాబాద్ : ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్‌తో పాటు ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును చెకింగ్ అధికారి ప్రకాష్ తనిఖీ చేశాడు.
ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించి జరిమానాతో పాటు కండక్టర్‌కు చార్జ్‌మెమో ఇవ్వకుండా ఉండేందుకు ప్రకాష్ వారి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు.
దీంతో ఆగ్రహించిన కండక్టర్, ప్రయాణికుడు అధికారిపై దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.