హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : భూ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదం టూ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసనకు దిగి న మైల భాస్కర్‌కు ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి భ రోసాఇచ్చారు. వెంటనే అతడి భూ సమస్యపై విచారణ చేపట్టాలని సిద్దిపేట కమిషనర్ బీ అనురాధను ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం కుటుంబంతో కలిసి సిద్దిపేట కమిషనరేట్‌కు చేరుకున్న భాస్కర్, కమిషనర్‌కు తన గోడు వెలిబుచ్చాడు. తన గోడును వినిపించిన ‘నమస్తే తెలంగాణ’కు భాస్కర్ కృతజ్ఞతలు తెలిపాడు.
నార్నూర్, డిసెంబర్ 17 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ఎంపీడీవో కార్యాలయంలోని మరుగుదొడ్డిలో ఉంచిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు ఎట్టకేలకు బీరువాలోకి చేరాయి. ‘మరుగుదొడ్డిలో సర్వే ఫారాలు’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఎంపీడీవో కార్యాలయ అధికారులు స్పందించారు. సర్వే ఫారాలను బీరువాలో పెట్టారు.