జమ్మికుంట: జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు జమ్మికుంట రూరల్ ఇన్చార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హుజూరాబాద్ టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా 35లక్షల రూపాయలతో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనం, యాదవ భవనం, బతుకమ్మ బండకు శంకుస్థాపన చేశారు.
అనంతరం గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కోరుతూ గడపడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ అర్ఎస్ రాష్ట్ర నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి , జిల్లా రైతు బంధు సభ్యుడు లింగ రావు, స్థానిక సర్పంచ్ కల్పన ఎంపీటీసీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.