ఖిలావరంగల్: ఇంటిని నేలమట్టం చేసిన వ్యక్తులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖిలావరంగల్‌కు చెందిన గండ్రాతి రాంనారాయణ సోమవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం అందచేశారు. వివరాల్లోకివ వెళ్తే..సర్వేనెంబర్ 294లోని 1.26 ఎకరాల భూమిలో నుంచి 18 గుంటల భూమిని లింక్ డాంక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశానని తెలిపారు. అయితే ఆర్ అండ్ బీ అధికారులు ల్యాండ్ ఆక్సీషన్ కింద 32 గుంటల భూమి అవార్డును బండి కుమారస్వామి తీసుకున్నాడని, అయితే ఆర్ అండ్ బీ అధికారులు తీసుకొన్న భూమిని విస్తీర్ణాన్ని, సర్వే నెంబర్‌ను అధికారులు తొలగించకపోవడం వలన అక్కడున్న భూమిపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు.
కొండ దేవయ్య, బండి సరోజన జేసీబీ సహాయంతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం చేస్తుంటే మిల్స్‌కాలనీ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పని ఆపి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారని, వినకుండా నిర్మాణం చేపడితే కూల్చి వేశారని తెలిపారు. తను కొనుగోలు చేసిన భూమిలో నిర్మాణం చేస్తున్న ఇంటిని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.