భైంసా/భైంసాటౌన్, సెప్టెంబర్ 22 : నిర్మల్ జిల్లా భైంసాలో విశేష పూజలు అందుకున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనం మంగళవారం అంగరంగవైభవంగా జరిగింది. పంజేషా చౌక్ వద్ద హిందువులు, ముస్లింలు ఐక్యంగా ఉంటూ మత సామరస్యాన్ని చాటారు.
నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో భైంసా బందోబస్తును పర్యవేక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్, సీఐ సాయికుమార్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భైంసాలో హిందూ, ముస్లింలు భాయ్భాయ్లాగా కలిసి గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, బబ్రు తదితరులు ఉన్నారు.