Lingala ghanapuram | ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం
ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లింగాల ఘణపురం : జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కుందారం, వనపర్తి, నేల పోగుల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో వనపర్తి కొనుగోలు కేంద్రంలో ఏఈఓ శ్రీనివాస్ ఒక్కరే ఉండడం నిర్వాహకులు ఎవరు లేకపోవడం, హమాలీలు రాకపోవడం, ధాన్యం కొనుగోలు ప్రారంభం కాక పోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాగైతే రైతుల నుండి సకాలంలో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తాం? కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎన్ని రోజులు పడిగాపులు కాయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారం రోజులు గడుస్తున్న ఒక్క గింజ కొనకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో అసౌకర్యం కలగొద్దని కలెక్టర్ ఆదేశించారు. కాగా, వనపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభం కాలేదు. మిల్లర్ల కేటాయింపు జరగాక పోవడంతో పాటు హమాలీల కూలీ రేటు నిర్ణయం కాలేదు, మంగళవారం ఉదయమే కొనుగోలు ప్రారంభం కావలసి ఉండగా హమాలీల సమస్యతో నిలిచిపోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

