ఆలేరు టౌన్, జూన్ 17 : ఆదిలాబాద్లో జరిగిన తొమ్మిదవ సబ్ జూనియర్ పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ పోటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్టులో ఆలేరుకు చెందిన గడ్డం సందీప్, బీరు సాయి గణేశ్, రాజబోయిన మణికంఠ, శనిగరం పార్థసారధి, కె.వెంకటేశ్ ఉత్తమ ప్రతిభ చూపి జట్టు విజయంలో సత్తా చాటారు. వీరంతా ఆలేరు ఖేలో ఇండియా హాకీ సెంటర్లో కోచ్ రావుల మురళి వద్ద శిక్షణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అధికారి ధనుంజయ ఆధ్వర్యంలో తృతీయ బహుమతి సాధించినటువంటి క్రీడాకారులను అలాగే కోచ్ రావుల మురళిని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావు అభినందించారు.