Cochlear Implants Surgery | వరంగల్ చౌరస్తా: పుట్టుకతోనే తీవ్రమైన వినికిడి లోపమున్న 16 నెలల చిన్నారికి కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీని నిర్వహించారు. మంగళవారం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నామని ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి అన్నారు.
ఈ శస్త్రచికిత్స నిర్వహించడానికి హైదరాబాద్ కోఠి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, సీనియర్ కాంక్లియార్ ఇంప్లాంట్ సర్జన్ డా.ఆనంద్ ఆచార్య ఆధ్వర్యంలో, సీనియర్ ఈఎన్టీ సర్జన్ డా. మనీష్ గుప్తా చేశారు. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.హరీష్ చంద్రారెడ్డి, ఈఎన్టీ విభాగాధిపతి డా. సంపత్, ప్రొఫెసర్ డా.విజయ్ కోఠి ప్రభుత్వ ఈఎన్ టి హాస్పిటల్ ఆడియాలజిస్ట్ డా. గీత సాంకేతిక పరమైన సహాయసహకారాలు అందించారు.
ఎంజీఎం హాస్పిటల్ అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ చిలక మురళి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాపద్మావతి, డా శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలు సాగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. పుట్టిన పిల్లలకు వినికిడి పరీక్షలు వెంటనే చేయించుకోవాలని, వినికిడి లోపం ఉన్న పిల్లలను పుట్టిన వెంటనే గుర్తిస్తే కాంక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ చేయవచ్చని, తద్వారా పుట్టు మూగ చెవిటి కాకుండా నిరోధించి, సామాన్య జీవితం అందించవచ్చని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకంలో పూర్తిగా ఉచితంగా చేయబడుతుంది. పుట్టుకతో తీవ్రమైన వినికిడి లోపము ఉన్న చిన్నారులకు వినియోగించువాలని సూచించారు. ఈ ఆపరేషన్ రెండు సంవత్సరంలోపు చేసుకుంటే పూర్తి స్థాయి ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.
Manchu Manoj | మహిళల వస్త్రధారణ వివాదం.. శివాజీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్
Dense Fog | తీవ్రమైన పొగమంచుతో పలు వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
Anchor Anasuya | ‘మా బాడీ మా ఇష్టం’.. నటుడు శివాజీకి అనసూయ కౌంటర్