గోదావరిఖని/శ్రీరాంపూర్, అక్టోబర్ 3: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికులకు ఏటా ఇచ్చే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ దీపావళి బోనస్-2026ను రూ.1,10,250 చెల్లించడానికి కోలిండియా యాజమాన్యం కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్న ది. శనివారం కోల్కతాలో 4వ జాతీయ కా ర్మిక సంఘాలు ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ప్రతినిధులతో కోలిండియా యాజమాన్యం చర్చలు జరిపింది. కోలిండియా చైర్మన్ సాయిరామ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా 1,96,753 మందికి దీపావళి బోనస్ అందనున్నది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య రిటైర్ అయిన సుమారు 8,351 మందికి కూడా నిబంధనల ప్రకారం పీఎల్ఆర్ బోనస్ అందుతుంది. సింగరేణిలోని సుమారు 32 వేలమంది ఉద్యోగులకు బోనస్ ప్రయోజనం కలుగుతుంది.