శనగలు: కప్పున్నర
శనగపిండి: ఒకటిన్నర టీ స్పూను
ఉల్లిపాయలు: రెండు మూడు
లవంగాలు: అయిదు
దాల్చిన చెక్క: రెండు ఇంచులు
బిర్యానీ ఆకులు: రెండు
పెరుగు: పెద్ద కప్పు
నెయ్యి: రెండు టీ స్పూన్లు
గరం మసాలా: టీస్పూను
కారం పొడి: అర స్పూను
పసుపు: పావు స్పూను
కొత్తి మీర: అరకట్ట
తయారు చేసే విధానం
పెరుగులో దాదాపు రెండు కప్పుల నీళ్లు పోసి మజ్జిగలాగా చిలకాలి. ఉల్లిపాయల్ని పొడవుగా సన్నగా తరగాలి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందు రోజు నానబెట్టుకున్న శనగల్ని ఉడికించుకోవాలి. ఒక గరిటెడు గింజలు పక్కన తీసి, శనగపిండితో కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మజ్జిగకు కలపాలి. కొద్దిగా పసుపు కూడా వేసి సన్నటి సెగ మీద పెట్టాలి. ఇప్పుడు మరో పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నెయ్యి వేసి లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులను వేయించి… ఉల్లిపాయల్ని కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగల్ని కూడా జోడించి ఉప్పు, కారం, గరం మసాలా పొడులు కలపాలి. ఇవన్నీ కొద్దిగా వేగాక, మజ్జిగలో వేసుకుని మరగబెట్టాలి. చివర్లో కొత్తిమీర కూడా కలుపుకుంటే ఉత్తరాది తరహా మజ్జిగ పులుసు సిద్ధమైపోతుంది. దీన్ని చపాతీలు, జీరారైస్లాంటి వాటితో కలిపి తింటే బాగుంటుంది.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు