గువాహటి, అక్టోబర్ 3: నైట్‌క్లబ్‌లో ఒక మహిళను వివస్త్రను చేసి, దారుణంగా ప్రవర్తించిన ఘటన అస్సాంలోని ఖానాపర ప్రాంతంలో చోటుచేసుకుంది. బౌన్సర్లు ఒక మహిళను వివస్త్రను చేసి ఆమెను కొడుతున్న ఘటన లోకల్స్ కేఫ్ అండ్ లాంజ్‌లో జరుగగా, దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. పార్కింగ్ ప్రాంతంలో ఒక మహిళ నగ్నంగా పడిఉండగా, చుట్కుపక్కల బౌన్సర్లు నిలుచుని ఉన్నారు.
దీనిని సుమోటాగా కేసు నమోదు చేసిన పోలీసులు క్లబ్ మేనేజర్, ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ మహిళ కొందరు స్నేహితులతో కలిసి క్లబ్‌కు వచ్చింది. లోపల దేనికోసమో వాగ్వాదం జరుగగా, బాటిల్‌తో ఒక బౌన్సర్‌ను కొట్టింది. దీంతో బౌన్సర్లు ఆమెను పట్టుకుని కిందకు ఈడ్చుకువచ్చి ఆమె బట్టలు విప్పి దౌర్జన్యం చేశారు. ఈ ఘటన అనంతరం నిర్వాహకులు క్లబ్‌ను మూసివేశారు.