‘ప్రజలనే అడుగుతా.. మూసీ అభివృద్ధి చేయాలో వద్దో.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా..’ అక్టోబర్ 29న మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి ‘నవంబర్ 8న యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొల్లేపల్లి, సంగం మధ్య భీమలింగం కత్వా వరకు మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్న సీఎం రేవంత్‌రెడ్డి’ నవంబర్ 4న మీడియాకు విడుదలైన అధికారిక ప్రకటన
CM Revanth Reddy | హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇండ్లు కోల్పోయి న మూసీ బాధితులంతా హైదరాబాద్‌లోని మూసీ పరీవాహకం చుట్టూ ఉండగా.. వారికి దూరంగా పంట పొలాల మధ్య ‘మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర‘ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర నాటకానికి తెరలేప డం మూసీ బాధితులు, రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేసింది. 11నెలల పాల నా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాదయాత్ర పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారనేది స్పష్టమైనట్టు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పేదల ఇండ్లను కూల్చి.. మూసీ చివరన ఉన్న ప్రాంతాల్లో యాత్ర చేపట్టడం ఏంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం రేవంత్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ సంఖ్యలో జనం ఉండే ప్రాంతాలను ఎంచుకొని యాత్ర చేపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తానని.. వారినే అడుగుతానన్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే పేదల ఇండ్లు కూల్చిన ప్రాంతాల్లో పర్యటించాలని సవాల్ విసురుతున్నారు.
పర్యటన ఇలా..
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 8న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బొల్లేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్క డి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు 6 కిలోమీటర్ల మేర యాత్ర సాగనున్నది. ఈ సమయంలో మూసీ పరీవాహక ప్రాంత రైతు లు, ప్రజలను రేవంత్‌రెడ్డి కలిసిల వారి సమస్యల్ని తెలుసుకోనున్నారు. సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు. ఈ పాదయాత్రలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఆందోళనలులేని ప్రాంతం నుంచే..
పేదల ఇండ్లు కూల్చేసి మూసీ పునరుజ్జీవం పనులు చేపడుతున్నారు. వేల ఇండ్లకు రెడ్ మార్క్ పెట్టడంతో నగరంలోని ప్రజలు సీఎం నిర్ణయాల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వం తరఫున ప్రజల మద్దతు కూడగట్టడానికి రేవంత్‌రెడ్డి ఇండ్లు కో ల్పోతున్న బాధితుల వద్ద నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారేమోనని అందరూ భావించారు. విచిత్రంగా ఆయన ఎటువంటి ఆందోళనలు లేని ప్రాంతాల నుంచి పాదయాత్ర ప్రారంభించాలనుకోవడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు ఎత్తుగడ ఇదే..
కాంగ్రెస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలతో తెలంగాణలో బీఆర్ఎస్ పుంజుకుంటున్నది. కా్ంర గెస్ ప్రభావం తగ్గిపోవడంతో రేవంత్‌రెడ్డి సరికొత్త ఎత్తుగడ వేసుకున్నారు. దీనికితోడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పాదయాత్రకు సిద్ధమైన వేళ ఆయన కంటే ముందుగా పాదయాత్ర చేయాలని రేవంత్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే తన షెడ్యూల్ ప్రకటిస్తానని చెప్పిన నేపథ్యంలో రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఓ సీఎం పాదయాత్ర చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే పాదయాత్ర డ్రామా సాగుతున్నదని సర్వత్రా చర్చ జరుగుతున్నది.