హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : భారీవర్షాల నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కేంద్రాలు విడిచి ఎక్కడికీ వెళ్ల్లవద్దని సూచించారు.
ప్రతి జిల్లా కేంద్రంలోనూ అత్యవసర సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాలు, వరద పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, టీజీఐఐసీ, హైడ్రాతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.