గోల్నాక, నవంబర్ 11 : అనారోగ్యానికి గురై పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా నిలుస్తోందని కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. గురువారం గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆమె అందజేశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందిన గోల్నాక జైస్వాల్ గార్డెన్‌కు చెందిన వి.రాజుకు రూ.27వేలు, కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతున్న గోల్నాకకు చెందిన దశరథ్కు రూ. 50వేలు, లివర్ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న శంకర్‌నగర్‌కు చెందిన నరసింహులు కు రూ. 60వేల విలువగల
చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో ఆపదలో ఉండి పలు దవఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.