సీఎంను ఎన్నడూ కలవనివ్వలేదు.. అవమానంగా ఫీలయ్యాం.. లేఖలో శివసేన రెబల్స్
ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖను ఏక్నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు. రాష్ట్రంలో శివసేన పార్టీకి చెందిన వ్యక్తే సీఎంగా ఉన్నా.. వర్షా బంగ్లాకు వెళ్లి ఆయన్ను కలిసేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కలేదని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. సీఎం చుట్టూ ఉండే మనుషులే తాము సీఎంను కలవాలో వద్దో నిర్ణయించేవాళ్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వ్యహరించిన తీరు అవమానకరంగా ఉందని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
సీఎం ఉద్దవ్ ఎన్నడూ సెక్రటేరియేట్ రాలేదని, ఆయన ఎప్పుడూ స్వంత నివాసం మాత్రుశ్రీలోనే ఉండేవారని, సీఎం ఇంట్లో ఉండే అధికారులకు ఫోన్ చేసినా.. వాళ్లెప్పుడూ ఆ ఫోన్లకు సమాధానం ఇవ్వలేదని, వీటన్నింటితో విసిగిపోయామని, అందుకే షిండేను ఆశ్రయించినట్లు రెబల్ ఎమ్మెల్యేలు తెలిపారు. స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను కలవలేకపోయేవారని, కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మాత్రం ఆయన్ను కలిసేవారని ఆరోపించారు. ఇక ఆ నేతలకు చెందిన నియోజకవర్గాలకు మాత్రమే నిధుల్ని రిలీజ్ చేసేవారని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
హిందుత్వ, రామ మందిరం మన పార్టీకి కీలకమైన అంశాలని, మరి అలాంటప్పుడు అయోధ్య వెళ్లకుండా తమ ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని రెబల్స్ ప్రశ్నించారు. ఆదిత్య థాకరే అయోధ్య వెళ్తున్న సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు వెళ్లనివ్వలేదని రెబల్స్ తమ లేఖలో అడిగారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

