హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం అంకురార్పణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 8న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) ప్రాంగణం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు పైలాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మూడేండ్లలో మూడు విడతల్లో చేపడుతుండగా.. దీనికి ప్రతీకగా త్రిభుజాకారంలో పైలాన్ నిర్మిస్తున్నారు. చదువులకు ప్రతీకగా మూడుభుజాల్లో మూడు పెన్నులను అమర్చుతున్నారు. ఈ పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించి, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.