హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరుగనున్నది. పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు తదితర అంశాలపై పార్టీ వైఖరిని పార్లమెంట్లో లేవనెత్తాల్సిన తీరుపై సీఎం పలు సూచనలు చేయనున్నారు.