మేడ్చల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్, మూడుచింతలపల్లి మండలాల్లో సోమవారం రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.