Public Voice | పూర్వం మా పెద్దలు ఊళ్లెమ్మటి ఆటపాటలు ప్రదర్శించేవాళ్లు. మాపటికి ఆట మొదలువెడితె, తెల్లారిందాక ఆడుదురు. ఆమ్దాని మంచిగ దొరికేది. వందల ఏండ్లు అట్లనే బతికారు. 1980 దాక దర్జాగ బతికినం. టీవీలచ్చినాంక మా బతుకులు ఆగమైనయ్. నలభై ఏళ్ల నుంచి సరిగ్గా ప్రదర్శనలు లేవు. కళాప్రదర్శనలకు సుత ఎవ్వలూ పిలుస్తలే. ఎవ్వలకన్నా దండం పెడితే కుంచెడు వడ్లు, గిద్దెడు బియ్యం దానం చేసేది. పైసలు సరిపోక గుడిసెలల్ల ఉంటున్నం. ముసలితనంలో ఏ పనీ చేతనైతలేదు. తెలంగాణ అచ్చినకాడి నుంచి మాకు మంచిగ నడుస్తుంది.
కేసీఆర్ సారు మాలాంటి చేతగాని ముసలోల్ల గురించి ఆలోచించిండు. మూడు వేల పింఛన్తోని ఇన్ని బియ్యం, ఉప్పు, పప్పు తెచ్చుకుని బతుకుతున్నం. మా జీవితం బాగుపడ్డది. బీఆర్ఎస్ వస్తే మాకు పింఛన్లు ఇంకా మంచిగొస్తయ్. కేసీఆరే మా దేవుడు.
గజవెల్లి కృష్ణయ్య, చిందు కళాకారుడు తీగలగుట్టపల్లి, కరీంనగర్ జిల్లా