చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే జాయింట్ కోఆర్డినేటర్ కే పళనిస్వామి ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇడప్పడి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇడప్పడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి 1989, 1991, 2011, 2016 ఎన్నికల్లో గెలిచారు.
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 19.
CM Edappadi K Palaniswami files his nomination from Edappadi as AIADMK candidate for #TamilNaduElections2021 pic.twitter.com/DWoWlkJQQe
— ANI (@ANI) March 15, 2021