మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 30 : సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో రంగారెడ్డి ఓవరాల్ విజేతగా నిలిచింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన వేర్వేరు ఫైనల్స్‌లో రంగారెడ్డి జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. బాలుర తుదిపోరులో రంగారెడ్డి 34-31తో వనపర్తిపై విజయం సాధించింది. బాలికల ఫైనల్లోనూ రంగారెడ్డి 57-39తో నల్లగొండపై గెలిచింది. బాలుర కేటగిరీలో నల్లగొండ, బాలికల విభాగంలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. బహుమతి ప్రదాన కార్యక్రమంలో టీవోఏ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.