CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
CJP : కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వానికి కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ఆందోళనకు బయల్దేరిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. ఈ ముగ్గురిని కోర్టు విడుదల చేసింది.
CJP : కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వానికి కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ఆందోళనకు బయల్దేరిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. ఈ ముగ్గురిని కోర్టు విడుదల చేసింది. శనివారం ఢిల్లీలో దిగగానే వీరిని విమానంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆదివారం స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సీజేపీ నాయకులను వెంటనే విడదుల చేయాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు. దాంతో.. దీప్కే, దాస్, రంక ఇక్కడి నుంచి నేరుగా జంతర్ మంతర్ వెళ్లే అవకాశముంది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఆందోళనలకు పిలుపినిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి గుడ్‌న్యూస్. కీలక నేతలను అరెస్ట్ చేసి నిరసనలు అడ్డుకోవాలని చూసిన పోలీసుల ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్ట వేసింది. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను విడుదల చేసింది. వీరిని ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఉదయం ఢిల్లీలోని కంటోన్మెంట్ పరిధిలోని కోర్టులో హాజరుపరిచారు.
అక్కడ విచారణ అనంతరం దీప్కే బృందం విడుదలకు కోర్టు ఆదేశాలిచ్చింది. దాంతో.. దీప్కే, దాస్, రంకలు తమ మద్దతుదారులకు అభివాదం చేశారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఈ ముగ్గురు నేరుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొననున్నారు.
VIDEO | Delhi: Executive Magistrate’s court releases CJP founder Abhijeet Dipke, and party leaders Saurav Das, Ashutosh Ranka. Visuals from Delhi Cantonment Police Station.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) https://t.co/UweLl56dyU
— Press Trust of India (@PTI_News) October 11, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

