తిరువనంతపురం : మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన కేరళలోని చర్చి పాస్టర్‌ను పోక్సో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పధనంతిట్ట జిల్లాలోని కూడల్ ఆర్ధడాక్స్ చర్చి పాస్టర్ పాండ్సన్ జాన్‌గా గుర్తించారు.
పాస్టర్ నిర్వాకాన్ని బాలిక (17) తమ టీచర్‌కు తెలపడంతో ఈ దారుణం వెలుగుచూసింది. కౌన్సెలింగ్ కొరకు బాలిక తన వద్దకు రాగా పాస్టర్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చదువులో వెనుకబడిన బాలికను మంచి మార్గంలో పెట్టాలని పాస్టర్ వద్దకు ఆమె తల్లి కౌన్సెలింగ్‌కు పంపగా పాడు పనికి తెగబడ్డాడు.
బాలికను తన ఇంటికి తీసుకువెళ్లిన పాస్టర్ ఆమె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి పిర్యాదు ఆధారంగా గురువారం ఉదయం చర్చి పాస్టర్‌ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.