తిరుమల : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ( CEC Gyanesh Kumar) ఆదివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ( Tirumala Darsan ) . ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి , ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయం లోపలమూలవిరాట్టుకు సీఈసీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గర్భగుడిలో మూలవిరాట్టు వేంకటేశ్వర స్వామిని, వకుళమాతను, ఆనంద నిలయ విమాన వేంకటేశ్వరుని, భాష్యకార్ల సన్నిధిని, యోగ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లోకనాథం పాల్గొన్నారు.