సమర్కండ్: చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్లో ఓడిన పురుషుల జట్టు వెంటనే గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన ఏడో రౌండ్లో భారత్ 2.5-1.5 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అర్జున్ గేమ్ డ్రా అయి నిహాల్ ఓడినా.. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గేముల్లో గెలిచి జట్టుకు విజయం అందించారు. కోనేరు హంపి నేతృత్వంలోని అమ్మాయిల జట్టు 3.5-0.5 తేడాతో జర్మనీని చిత్తు చేసింది.