సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత (Nallanagula Swetha) ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను జనగామ ఏరియా దవాఖానకు తరలించారు. అయితే ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.
బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామానికి చెందిన నల్లనాగుల శ్వేతవెంకటాచారి గతేడాది జూలై 21న మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అదే నెల 25న బాధ్యతలు చేపట్టారు.