న్యూఢిల్లీ : ఓపెన్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ గో ఈ నెల 4 నుంచి ఏడాది పాటు భారత్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ రాయడం, పరిశోధన, కోడింగ్ లాంటి పనులకు ఏఐ టూల్స్‌పై ఆధారపడటం ఎక్కువైన నేపథ్యంలో ఓపెన్ ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీ గో జీపీటీ-5 మాడల్ ఆధారంగా పని చేస్తుంది. ఎక్కువ పరిమితితో ఉపయోగించుకోవడం, త్వరగా సమాధానాలు పొందడం, చిత్రాల సృష్టి, ఫైల్ అప్లోడ్స్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉంటాయి.
ఉచిత జీపీటీ-4 మినీ మాడల్స్ కన్నా బాగా విషయాన్ని అర్థం చేసుకొని చురుకైన సమాధానాలను ఇస్తుంది. చాట్‌జీపీటీ గో సేవలకు chat.openai.com లేదా చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌లో సైన్ ఇన్ అయ్యి కొత్త అకౌంట్ తెరవాలి. సెట్టింగ్స్‌లో అప్‌గ్రేడ్ ప్లాన్ ఎంపిక చేసుకొని చాట్‌జీపీటీ గోను సెలెక్ట్ చేసుకోవాలి. ధ్రువీకరణ కోసం పేమెంట్ వివరాలు జత చేసి చందాను ధ్రువీకరించుకోవాలి.