న్యూఢిల్లీ : భారత్లోని అత్యంత ధనవంతులైన 1 శాతం మంది సంపద 62 శాతం పెరిగిందని ‘జీ20’ నివేదిక పేర్కొన్నది.
జీ20 నేతృత్వంలో రూపొందిన నివేదిక ప్రకారం, 2000 నుంచి 2024 మధ్యకొత్తగా ఏర్పడిన సంపదలో ప్రపంచ జనాభాలోని అట్టడుగు వర్గానికి దక్కిన వాటా కేవలం 1 శాతం కాగా, అత్యంత ధనవంతులైన 1 శాతం మంది 41 శాతం వాటాను కైవసం చేసుకున్నారు.