ఐసీసీ సమావేశానికి నఖ్వీ డుమ్మా!
గత నెలలో ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచినా ట్రోఫీని ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఐసీసీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్నాడు.
దుబాయ్: గత నెలలో ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచినా ట్రోఫీని ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఐసీసీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్నాడు. దుబాయ్‌లో మంగళవారం ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ ప్రారంభమవగా నాలుగు రోజులు పాటు సమావేశాలు జరుగనున్నాయి.
ట్రోఫీ వివాదంపై ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ.. ఈ అంశాన్ని ఐసీసీ మీటింగ్‌లో లేవనెత్తుతామని, ఆ తదనంతర పరిణామాలు ఎదుర్కోవాలని ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో నఖ్వీ ముఖం చాటేయనున్నట్టు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తరఫున చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ ఈ సమావేశానికి హాజరవనున్నట్టు తెలుస్తున్నది.
అయితే పీసీబీతో పాటు ఏసీసీ చీఫ్‌గా ఉన్న నఖ్వీ.. మీటింగ్‌కు రాకుంటే కనీసం ఆన్లైన్లో అయినా హాజరవుతాడా? లేదా? అన్నదానిపైనా సమాచారం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌పై అవాకులు చెవాకులు పేలిన నఖ్వీ.. రాజకీయ కారణాల వల్లే ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్టూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

