సబ్మిట్చేసే ముందు ప్రివ్యూకు సమయం
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మార్పులు
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తు ప్రివ్యూ కోసం కొత్తగా మూడు నిమిషాల సమయం కేటాయించారు. ఒక దరఖాస్తును క్షుణ్ణంగా చదివేందుకు 2.54 సెకండ్లు పడుతుందని పరిశీలనలో తేలడంతో 3 నిమిషాలు కేటాయించారు. ఈ సమయంలో పూరించిన దరఖాస్తును అభ్యర్థులు క్షుణ్ణంగా చదువుకోవాలి. అక్షరదోషాలు, తప్పొప్పులుంటే సరిచేసుకోవాలి. 3 నిమిషాలలోపు అభ్యర్థులు సమర్పిద్దామన్నా.. వెబ్సైట్ అంగీకరించదు. మూడు నిమిషాలు పూర్తయిన తర్వాత సబ్మిట్ కొడితే స్వీకరించేలా వెబ్సైట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్ఎన్ఎం పోస్టుల దరఖాస్తుల్లో పొరపాట్లు జరుగడంతో అభ్యర్థుల్లో కొందరు టీఎస్పీఎస్సీని ఆశ్రయించారు. ఆరా తీస్తే.. మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లల్లో దరఖాస్తులు ఇవ్వడం, అభ్యర్థుల బంధువులు దరఖాస్తు చేయడంతో తప్పలుదొర్లాయి. ఎంపికైనవారు ఇబ్బందుల పడటంతో అప్పటికప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.