హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న బాబు సాధారణ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్నది. కాగా శుక్రవారం జరగాల్సిన విచారణకు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరుకాలేదు. ఏఏజీ విచారణకు హాజరుకాలేకపోతున్నారని, మరింత సమయం కావాలని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకిని తీసుకున్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.