అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం విశాఖలో నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ మీద ప్రయాణిస్తుండగా అదుపు తప్పి కిందపడిపోతున్న క్రమంలో వెంటనే అప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాను కూడా సైకిల్ మీద వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
చంద్రబాబుకి తప్పిన ప్రమాదం
విశాఖలో నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ మీద ప్రయాణిస్తుండగా తప్పిన ప్రమాదం pic.twitter.com/LkaxZfoFe6
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026