Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Chakali Ilamma | మెదక్ పట్టణంలో తెల్లవారుజామున చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు
Chakali Ilamma | మెదక్ అర్బన్, అక్టోబర్ 13: మెదక్ పట్టణంలో తెల్లవారుజామున చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటన నేపథ్యంలో సీఐ మహేష్ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు సంయమనం పాటించాలని సీఐ సూచించారు. ఘటనపై పోలీసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధ్యులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
విగ్రహం ధ్వంసం ఘటనపై రజక సంఘం నాయకులు పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. విగ్రహం వద్ద సరైన కోణంలో సీసీ కెమెరాలు లేకపోవడం, అందుబాటులో ఉన్న కెమెరాలు ఘటనను స్పష్టంగా గుర్తించే విధంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ, ఆమె విగ్రహానికి తగిన భద్రత కల్పించకపోవడంపై పలువురు విమర్శలు గుప్పించారు.
విగ్రహం ధ్వంసం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని రజక సంఘం నాయకులకు మద్దతు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై రజక సంఘం ఆధ్వర్యంలో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

