Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
Actress Laya | ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు.
Actress Laya | ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయిక లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న లయ.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా వరుస అవకాశాలతో మళ్లీ వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇటీవల నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమాలో కనిపించిన ఆమె.. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు.ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో లయ పంచుకున్న ఆసక్తికర విషయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేసిన సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అనుకోకుండా బాలకృష్ణ కాలు తొక్కడం, ఆ తర్వాత ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలకు తాను భయపడిన విషయాలను వెల్లడించారు. నందమూరి బాలకృష్ణతో కలిసి ‘విజయేంద్ర వర్మ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. అయితే బాలకృష్ణ గురించి బయట వాళ్లు చెప్పే మాటలు విని ఆయన చాలా కోపంగా ఉంటారని మొదట అనుకున్నానని చెప్పారు. అయితే, ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత తన అభిప్రాయం మారిపోయిందని తెలిపారు.బాలకృష్ణ ఎంతో ఆప్యాయంగా, సరదాగా ఉంటారని.. ఆయనతో దగ్గరగా మాట్లాడినప్పుడు ఎన్టీఆర్‌ను చూసినట్లుగా అనిపిస్తుందని లయ పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఆయన తనను ప్రోత్సహించేవారని, ముఖ్యంగా డాన్స్ సన్నివేశాల్లో సరదాగా మాట్లాడి ఉత్సాహపరిచేవారని చెప్పారు.
‘విజయేంద్ర వర్మ’ సినిమా పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను లయ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. పాట కోసం డాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అనుకోకుండా బాలకృష్ణ కాలు తొక్కానని తెలిపారు. అప్పుడు బాలకృష్ణ సరదాగా ప్యాకప్ చెప్పి, తనను సినిమా నుంచి తీసేయమన్నట్లుగా మాట్లాడారట. ఆ మాటలను నిజమని భావించిన లయ ఒక్కసారిగా భయపడ్డారని, తనకు ఏడుపు కూడా వచ్చిందని చెప్పారు. అయితే, తాను అలా భయపడటాన్ని గమనించిన బాలకృష్ణ వెంటనే అది సరదాగా అన్న మాటేనని, నిజంగా అనుకోవద్దని నవ్వుతూ చెప్పారట. దీంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది. డాన్స్ సన్నివేశాల్లోనూ బాలకృష్ణ తనను ప్రోత్సహిస్తూ, అప్పుడప్పుడు తనకంటే బాగా చేస్తున్నావంటూ సరదాగా మెచ్చుకునేవారని లయ వెల్లడించారు. తెరపై గంభీరంగా కనిపించే బాలకృష్ణ.. వ్యక్తిగతంగా ఎంతో సరదాగా ఉంటారని ఆమె చెప్పిన ఈ విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

