Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Vijay | ప్రస్తుతం టాలీవుడ్లో భారీ అంచనాలున్న చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట.. మరోసారి కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vijay | ప్రస్తుతం టాలీవుడ్లో భారీ అంచనాలున్న చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట.. మరోసారి కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. తాజాగా వీరిద్దరూ తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన విషయాలను విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకోవడంతో ఆ పోస్ట్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకమని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. రోజంతా పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తమను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారని తెలిపారు. జీవితం, పని, ప్రపంచం గురించి తన వ్యక్తిగత అభిప్రాయాలను విజయ్ తమతో పంచుకున్నారని వెల్లడించారు. ఒక్కసారి కలిసినప్పుడే ఆయన తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారని విజయ్ దేవరకొండ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోసారి కలుద్దామని, ప్రేమతో పాటు గౌరవాన్ని తెలియజేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ భేటీకి సంబంధించిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక ‘రణబాలి’ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అప్పటి ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం, భావోద్వేగాలు, భారీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. విజయ్ దేవరకొండ, రష్మిక జంట మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Had the most beautiful time with the dearest Thalapathy @actorvijay Sir.
Even after a long day he received us with so much love and shared such personal insights into life, work and the world.
One meeting and sir is already a favourite ❤️
Until next time,
My love and respect.
Vijay Deverakonda 🙂— Vijay Deverakonda (@TheDeverakonda) October 12, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

