Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Virosh | టాలీవుడ్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ‘రణబాలి’ ఒకటి. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సినిమా ముందస్తు విడుదల వేడుకకు ముందు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Virosh | టాలీవుడ్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ‘రణబాలి’ ఒకటి. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సినిమా ముందస్తు విడుదల వేడుకకు ముందు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు అక్టోబర్ 13, 2026 తెల్లవారుజామున వీరిద్దరూ తిరుమలకు వెళ్లారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్న అనంతరం వీరిద్దరూ హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం. నేడు ‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా, దానికి ముందు వారు శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇప్పుడు ‘రణబాలి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో ఈ జంటను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే, దేశవ్యాప్తంగా సినిమా టికెట్ల ముందస్తు బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.
ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ‘ది మమ్మీ’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ‘రణబాలి’లో కీలక పాత్ర పోషించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అజయ్–అతుల్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.స్వాత్రంత్య్రానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చారిత్రక నేపథ్యం, భారీ నిర్మాణ విలువలు, విజయ్ దేవరకొండ–రష్మిక జంట, హాలీవుడ్ నటుడి భాగస్వామ్యంతో ‘రణబాలి’పై అంచనాలు నెలకొన్నాయి. మరి అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
A divine visit to Tirumala!
#VijayDeverakonda and #Rashmika seek the blessings of Lord Venkateswara. 🙏
#Ranabaali https://t.co/U4ZAZ7R7Ef
— Suresh PRO (@SureshPRO_) October 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

