న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. మినీ చార్ధామ్ యాత్ర కూడా మరి కొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా రాష్ర్టాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.
పరిశుభ్రత ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని.. పుణ్యక్షేత్రాల్లో ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్‌ను మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.