బీజింగ్: చైనా నిర్మించిన త్రీ గోర్జెస్ ఆనకట్ట వల్ల భూ భ్రమణం నెమ్మదించిందన్న విషయం విన్నప్పుడు ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్తు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆ దేశం చేపట్టింది.
టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని సుమారు 1.2 ట్రిలియన్ల యువాన్ల ఖర్చుతో నిర్మిస్తున్నది. త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే అధిక సామర్థ్యంతో గంటకు సుమారు 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్తును ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నది.