Jamili Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో జమిలి ఎన్నికలకు (ఏకకాల ఎన్నికలకు) ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమో దం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను ఈ మేరకు ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే
అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్లు సహా 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా నేతృత్వంలోని ప్యానెల్ వెల్లడించింది. ప్రస్తుత ఎన్డీఏ సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా ఇటీవల స్పష్టంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధాని మోదీ జమిలి గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి రావొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
కోవింద్ కమిటీ సిఫారసులు ఏమిటంటే?
ఏయే దేశాల్లో ఏక కాల ఎన్నికలు
ప్రపంచంలోని 194 దేశాల్లో ప్రస్తుతం పది దేశాల్లో మాత్రమే జమిలి ఎన్నికల విధానం అమల్లో ఉన్నది. అయితే, ఈ అన్ని దేశాల జనాభా.. భారత దేశ జనాభాలో 34 శాతం కూడా లేదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్న చాలా వరకు దేశాల్లో అధ్యక్ష తరహా పాలన కొనసాగుతుండటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ ఇలా..
జమిలి ఎన్నికల నిర్వహణపై సిఫారసులు, కమిటీల ఏర్పాటు ఈనాటిది కాదు. 1983లో నాటి ఎన్నికల సంఘం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరుపాలని ప్రతిపాదించింది. 1999లో లా కమిషన్ ఇదే సూచన చేసింది. 2015లో పార్లమెంటరీ కమిటీ జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి 2016 తర్వాత కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, లా కమిషన్, నీతిఆయోగ్ పలు కమిటీలుగా ఏర్పడి ‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’కు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. ప్రస్తుతం కేంద్రం నిర్ణయించిన కోవింద్ కమిటీ నాలుగవది.